Search This Blog

Friday 6 March 2015

kavisannohalu - Sinaamasa

కవి సన్నోహాలు - శినామాస ____________________________________________________________________

నేలమ్మ తల్లికి పులకరింపులు రైతన్న చేతికి సిరుల పంటలు
ఇది చూడ సూరయ్య వేగిరముగా మకరరాశిలోకి మారగా ఊరంత ఉత్సవాలు... సంక్రాంతి సంబరాలు
వీధి వెంబడి భోగి మంటలు ముంగిటంతా ముత్యాల ముగ్గులు హరిదాసుల కీర్తనలు డుడ్డు బసవన్నల విన్యాసాలు
ఇంటి నిండా బంధు జనాలు ఆకలి రేపు పిండి వంటలు కొత్త అల్లుళ్ళ కోలాహలాలు సరదాల కొలది గాలి ఆటలు, పందెపు కోళ్ళు, ఎడ్ల పందేలు
____________________________________________________________________
నేను నినదించేది నినాదమే అయితే?
ప్రభవించేది విధానమా!!
నిర్భయలు లేని సమాజము కలయా? నిర్భాగ్యుల జన జీవనమో కళయా!!
మతోన్నమాదమా, కుల గోత్రాముల ప్రస్థానమా? జనుతు జీవనమే ప్రధాన భాగ్యమా... జగత్ కళ్యాణము అన అర్థ మూల్యమా!!
నేను నినదించేది నినాదమే అయితే? ప్రభవించేది విధానమా!! ప్రభవించేది విధానమా!!
__________________________________________________________________
గరీబోల్ల దేశమని నమ్మబలికారు మన్నిస్తే మంచిగా ఖరీదు చేసుకుంటాం అని వాపోయారు మిరియాల కొన్నారు... మిటమిటలాడారు!!
వర్తకాన లాభాల లబ్ధిని చూసి సంపన్న దేశాన సార్వభౌములమవుదామని జాస్తిని చేసి రాజకీయాలు చేశారు...రాజధానులనేలారు!!
కొందరు నడ్డి విరిచారు .. కొందరు గడ్డి కరిపించారు.. కొందరు దేహి అని అనిపించారు.. కొందరు మాత్రం మనసున మన్ననలు పొందారు, స్వార్ధ రహితులై సేవలందించారు!!
కాలాలు మారుతున్నా కథలు మారక.. యువ తేజం విప్లవ బాట సాగగా... అనుభవజ్ఞులైన పెద్దలు రాయభారాల రాగమాలపించారు!!
విప్లవాల దారిని.. సహనాల స్ఫూర్తి ని జత చేసి ఉప్పు దారిన వచ్చిన వారికి ఉప్పు తోనే గుణపాఠము నేరింపి శాంతి మార్గములు సారము చవి చూపించి భావి తరాలకు, సమస్త లోకములకు ఒక దిక్సూచిగా నిలిచి అర్ధభాగమున స్వతంత్రముగా జయకేతనాలు రెప రెప లాడించాము.
___________________________________________________________________
కనుబొమ్మలో కదిలిందిగ నీ రూపమే సరికొత్తగా యద మాటున మెదిలిందిగ నీ ఊసులే గమ్మత్తుగా చిరు చినుకుల ఆషాడం లా మరు మల్లెల వైశాఖం లా కష్టమగుతున్నదే కాదని అనడం...
కవ్వించే విరుపులని కసి పెంచే సొగసులని వేదించి వడ్డించే వయ్యారపు మెలికలని చూడ.. తగని తపనలు తనువున రేగే వేసవి తాపాలను మనసున రగిలే ఉడుకుతున్నది వయసును వసంతాల వేలయ్యిన..
మైమరచిన మనసు, మనసా"రా" అడుగుతున్నది తగునా ఈ దాపరికములు కను రెప్పల తేర చాటున?? తెగునా ఈ వీ"క్షణములు" తరుణీమని, తమరి నిజ రూపమున??
__________________________________________________________________
త్రైత్రేయమైన తరిగి పోదా చైత్రమైన చెదిరిపోదా బాహుబందాల మాటున మల్లె జాజుల ఘాటున వసంతమైన వేడెక్కునే ఎండలైనా ఎండిపోవునే నిలిచియున్న హా(... కారముల మైకమున నిబద్ధత లేని నిశబ్దత స్థానమున!!


__________________________________________________________________
స్వతంత్ర దేశము, స్వతంత్ర దేశము
స్వదేశీ వెలుగుల సువర్ణ దేశము
కలాము కన్న కలల దేశము
స్వతంత్ర దేశము, స్వతంత్ర దేశము
మహనీయుల మాతృ దేశము
విజ్ఞానము నిండిన విశాల దేశము

స్వతంత్ర దేశము, స్వతంత్ర దేశము
విలువలు కలిగిన మహామాన్విత దేశము
రుణ బంధముల భాగ్యోదయ దేశము
యుక్తి గల యువకుల కార్య క్షేత్రము
కడు క్షోబలు కలగిన చెక్కు చెదరని చరిత్ర గల దేశము
స్వతంత్ర దేశము, స్వతంత్ర దేశము
గుణ గణ ముల గణతంత్ర దేశము
సిద్దుల పుణ్య దేశము, యోగుల అన్వేషణము
మన ఈ భారతదేశము!!








No comments:

Post a Comment

We valued your valuable comments.